చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం అబ్బగొందిలో.... పొలం నీటి కోసం బంధువుల మధ్య ఏర్పడిన తగాదా.... తీవ్ర ఘర్షణకు దారితీసింది. నీటి విషయంలో శ్రీనివాసులు అనే వ్యక్తి తన బాబాయి చిన్నప్ప, అమర్‌నాథ్‌తో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరిగి శ్రీనివాసులు అతని కుమారుడు చంద్రశేఖర్‌తో కలిసి చిన్నప్ప, అమర్‌నాథ్‌పై కొడవలితో దాడికి దిగారు. గాయాలపాలైన చిన్నప్ప, అమర్‌నాథ్‌లను స్థానికులు మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.
పొలం నీటి విషయంలో బంధువుల మధ్య ఘర్షణ - madanapalle latest updates
పొలం నీటి కోసం బంధువుల మధ్య ఏర్పడిన తగాదా తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామీణ మండలంలో జరిగింది. ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![పొలం నీటి విషయంలో బంధువుల మధ్య ఘర్షణ చికిత్స పోందిన బాధితుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9305894-240-9305894-1603611563967.jpg)
చికిత్స పోందిన బాధితుడు