వేరుశనగ విత్తనాల పంపిణీ విషయంలో అధికార పార్టీ నాయకుల మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసి కొడవళ్లతో దాడులకు తెగబడే వరకూ తీసుకెళ్లింది. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం యనమలవారిపల్లెలో రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ కోసం వైకాపా కార్యకర్తలు పోటీపడ్డారు. ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ తలెత్తగా... మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు పరస్పరం కొడవళ్లతో దాడులకు దిగారు. ఈ సంఘటనలో ఇద్దరు కార్యకర్తలకు తీవ్రగాయాలు కాగా... వారిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం పంపించారు.
వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ... కొడవళ్లతో దాడి - చిత్తూరులో వైకాపా నేతల దాడులు న్యూస్
చిత్తూరు జిల్లా యనమలవారిపల్లెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేరుశనగ విత్తనాలు పంపిణీలో వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. కొడవళ్లతో పరస్పరం దాడి చేసుకోవడంతో కొందరికి తీవ్రగాయాలయ్యాయి.
కొడవళ్లతో దాడి చేసుకున్న వైకాపా కార్యకర్తలు
TAGGED:
ysrcp attacks news