చిత్తూరు జిల్లా పలమనేరు పురపాలక సంఘం వద్ద వైకాపా - తెదేపా నాయకులు ఘర్షణకు దిగారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం తోపులాటకి దారి తీసింది. నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కాకుండానే పురపాలక సంఘం కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించగా... తెదేపా నాయకులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడం గొడవకు కారణమైంది. నామినేషన్ల ఉపసంహరణలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ దాడికి దిగిన ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసులు తీవ్రంగా శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.
పలమనేరు పురపాలక సంఘం వద్ద తోపులాట - ఏపీ మున్సిపల్ ఎన్నికలు 2021
చిత్తూరు జిల్లా పలమనేరు పురపాలక సంఘం వద్ద వైకాపా - తెదేపా నాయకులు ఘర్షణకు దిగారు. పురపాలక సంఘం కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించగా.. తెదేపా నాయకులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
![పలమనేరు పురపాలక సంఘం వద్ద తోపులాట ap municipal elections 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10855473-377-10855473-1614772285868.jpg)
ap municipal elections 2021
పలమనేరు పురపాలక సంఘం వద్ద తోపులాట