ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - justice bobde in ap latest news

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్ అరవింద్ బోబ్డే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి దర్శించుకున్నారు.

శ్రీవారి సన్నిధిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌. శరద్ అరవింద్ బోబ్డే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌. జితేంద్ర కుమార్‌ మహేశ్వరి

By

Published : Nov 24, 2019, 2:35 PM IST

శ్రీవారి సేవలో పాల్గొన్న సీజేఐ
చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్ అరవింద్ బోబ్డే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి దర్శించుకున్నారు. అలయ మహద్వారం వద్దకు చేరుకున్న భారత ప్రధాన న్యాయమూర్తికి అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధికి చేరుకున్న వారు కొన్ని నిమిషాల పాటు మూల మూర్తిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్‌ శరద్ అరవింద్ బోబ్డే, జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరికి పండితులు వేదాశీర్వచనం పలికి.. శేషవస్త్రంతో సత్కరించారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ కలసి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటంను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details