ఇదీ చూడండి:
'రాజీనామా కాదు.. పృథ్వీరాజ్‌పై కఠినచర్యలు తీసుకోవాలి' - తిరుపతిలో సీఐటీయూ నాయకుల ఆందోళన వార్తలు
ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. ఆరోపణలకు రాజీనామా ఒక్కటే సమాధానం కాదని... ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి డిమాండ్ చేశారు. పృథ్వీ ఆడియో టేపుల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని అన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తితిదే ఆధ్వర్యంలో లైంగిక నిరోధక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం పృథ్వీరాజ్‌పై తక్షణం చర్యలు చేపట్టకపోతే... పెద్దఎత్తున ఉద్యమిస్తామని సీఐటీయూ నేతలు హెచ్చరించారు.
ధర్నా చేస్తున్న సీఐటీయూ నాయకులు