ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలనాటి నాణేలు.. ఈనాటి ప్రదర్శనలో.. - చిత్తూరులో పాత నాణేల ప్రదర్శన

250 దేశాల పురాతన నాణేలను.. కరెన్సీ నోట్లను ఒక్కసారిగా చూస్తే భలే సరదాగా ఉంటుంది కదూ. చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా.. మన దేశ రాజులు, ప్రపంచ దేశాలు వాడిన ఆ నాణేలు, నోట్లను ఇప్పుడు చూస్తుంటే పూర్వ వైభవం గుర్తుకు వస్తుంది. మరి వాటిని చూడాలంటే చిత్తూరు జిల్లా కలికిరి సీకాం డిగ్రీ కళాశాలలో జరిగే కరెన్సీ ఎగ్జిబిషన్​ని చూడాల్సిందే..!

cions-exhibition-at-seekam-degree-college-in-kalikkari-chittoor-district
అలనాటి నాణేలు.. ఈనాటి ప్రదర్శనలో

By

Published : Feb 18, 2020, 4:49 PM IST

ప్రదర్శనలో 250 దేశాల పురాతన నాణేలు, కరెన్సీ నోట్ల ప్రదర్శన

చిత్తూరు జిల్లా కలికిరి సీకాం డిగ్రీ కళాశాలలో జరుగుతున్న కామర్స్, సైన్స్ టెక్నాలజీ కరెన్సీ ఎగ్జిబిషన్ విద్యార్థులను ఆకట్టుకుంటోంది. ప్రపంచ నాగరికతకు చిహ్నాలైన... 250 దేశాల కరెన్సీ నోట్లు, నాణేలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. భారతదేశ పూర్వ వైభవాన్ని చాటిచెప్పే బంగారు, వెండి, రాగి, ఇత్తడి నాణేలు.. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం నుంచి ఈస్టిండియా కంపెనీ వరకు వాడుకలో ఉన్న నాణేలను ప్రదర్శించారు. ఆయా రాజుల కాలం నాటి వివరాలను సైతం ప్రదర్శనకు ఉంచారు. మన దేశ రాజులు వాడిన నాణేలను చూస్తుంటే.. అప్పటి వైభవాన్ని గుర్తుచేస్తున్నాయి. రాయలసీమ న్యూమిస్ సొసైటీ, అనంతపురం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన సాగుతోంది. సజీవ సాక్ష్యాలుగా నిలుస్తోన్న ఆ కరెన్సీ నోట్లు, నాణేలను చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details