CINE ACTORS VISIT TIRUMALA: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, సినీ నటుడు కార్తికేయ దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. వివాహం జరిగిన తరువాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు నటుడు కార్తికేయ తెలిపారు.
VIPS AT TIRUMALA: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
TIRUMALA: తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు