చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు అనితారాణి కేసులో... ప్రాథమిక విచారణ పూర్తి చేసినట్లు సీఐడీ ఎస్పీ రత్న ప్రకటించారు. విచారణ నిమిత్తం వైద్యురాలు వద్దకు వెళ్లగా ఆమె నిరాకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో ఫోన్ ద్వారా ఆమెతో సంభాషించినట్లు పేర్కొన్నారు. తనకు సీఐడీ వ్యవస్థపై నమ్మకం లేదని... సీబీఐ అధికారులతో విచారణ చేపట్టాలని అనితారాణి డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.
ఆ విషయాన్నే వైద్యురాలి స్టేట్మెంట్గా తాము ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా రికార్డు చేశామన్నారు. అనితారాణి పనిచేసిన పెనుమూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం, స్థానిక పోలీస్ స్టేషన్, వైద్యశాల సిబ్బంది, ప్రస్తుతం ఆమె డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న టీబీ నివారణ కేంద్రాల్లో దాదాపు 20 మందికిపైగా విచారించినట్లు పేర్కొన్నారు.