చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ యువకునికి కరోనా పాజిటివ్ రావటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా శ్రీకాళహస్తిని సందర్శించి.. నియోజకవర్గంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచించారు. కరోనా సోకిన వ్యక్తి నివాసం నుంచి 3 కిలోమీటర్ల మేర స్ప్రేయింగ్ చేయించేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. 20 వేల పట్టణ జనాభాను సర్వే చేయిస్తామన్న ఆయన.. దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు తిరగరాదని స్పష్టం చేశారు.
'కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకున్నాం' - srikalahasthi corona case news
జిల్లాలో కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. శ్రీకాళహస్తిలో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఆయన.. అక్కడ పర్యటించి పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. పట్టణంలో మళ్లీ రీసర్వే చేస్తామని.. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
!['కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకున్నాం' 'కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకున్నాం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6533079-956-6533079-1585087325632.jpg)
'కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకున్నాం'
కరోనా నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్న కలెక్టర్
ఇదీ చూడండి: