ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ ప్రత్యేక జైలుగా పీలేరు సబ్ జైలు - కొవిడ్ ప్రత్యేక జైలుగా పీలేరు సబ్ జైలు వార్తలు

చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైలును కొవిడ్ ప్రత్యేక జైలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఖైదీలకు వైరస్ సోకుతుండటంతో ప్రతి జిల్లాలోనూ ఒక సబ్ జైలును కొవిడ్ ప్రత్యేక జైలుగా గుర్తిస్తున్నారు.

chittore district peeleru sub jail as covid specia jail
పీలేరు సబ్ జైలు

By

Published : Jul 9, 2020, 7:53 AM IST

చిత్తూరు జిల్లా పీలేరు సబ్​ జైలును కొవిడ్ ప్రత్యేక జైలుగా గుర్తిస్తూ.. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కుమార విశ్వజిత్ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న పలువురు ఖైదీలకు కరోనా సోకినట్లు నిర్ధరించారు. వీరి వలన ఇతరులకు వైరస్ సోకే ప్రమాదముందని గుర్తించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక సబ్ జైలును కొవిడ్ ప్రత్యేక జైలుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పీలేరు సబ్​జైలును కరోనా జైలుగా గుర్తిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇందులో ప్రత్యేక అధికారితోపాటు పారా మెడికల్ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details