దేశంలో కొవిడ్ - 19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా తిరుపతి రుయా, మెటర్నిటీ ఆసుపత్రుల్లో ఉన్న ఐసోలేషన్ వార్డులను.. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పరిశీలించారు. కరోనా వ్యాప్తి కట్టడిపై వైద్యులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజులపాటు ఇళ్లలోనే ఉంటూ వైద్యపరీక్షలు చేయించుకోవాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తిరుపతి ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు పరిశీలించిన కలెక్టర్ - తిరుపతి రుయా ఆసుపత్రిని పరిశీలించిన చిత్తూరు కలెక్టర్
తిరుపతి రుయా, మెటర్నిటీ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను.. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తిరుపతి రుయా ఆసుపత్రిని పరిశీలించిన చిత్తూరు కలెక్టర్