లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 6 వేల కేసులు నమోదు చేశామని ఎస్పీ సెంథిల్‌కుమార్ తెలిపారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో 100 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు జిల్లాలోకి ప్రవేశించకుండా నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. లాక్‌డౌన్ సందర్భంగా అమలవుతున్న 144 సెక్షన్ అతిక్రమించిన వారిపై ఐపీసీ 188 యాక్ట్, మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్ అమలు తీరుపై ఎస్పీ సెంథిల్‌కుమార్‌తో ఈటీవీ ముఖాముఖి.
లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ సెంథిల్ - chittor sp told on lock down
లాక్‌డౌన్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో లాక్‌డౌన్ అమలు తీరుపై ఎస్పీతో ఈటీవీ ముఖాముఖి.
![లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ సెంథిల్ chittor-sp-told-on-lock-down](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6686888-322-6686888-1586185221322.jpg)
చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్‌తో ముఖాముఖి