చిత్తూరు జిల్లాలో త్వరలో జరిగే నగరి జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు.. అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు కోరారు. పుత్తూరు డీఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. జాతర విషయంలో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గి పరిస్థితి లేదని పేర్కొన్నారు.
నగరి జాతరకు అంతా సహకరించండి!
చిత్తూరు జిల్లా పుత్తూరు డీఎస్పీ కార్యాలయంలో నగరి జాతర విషయమై పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు సమీక్షించారు. జాతర ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలు, నాయకులు సహకరించాలని కోరారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్