నెల రోజుల వ్యవధిలో చోరీకి గురైన, పోగొట్టుకున్న 277 మొబైల్ ఫోన్లను చిత్తూరు జిల్లా పోలీసులు రికవరీ చేశారు. చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. సాంకేతిక విద్యనభ్యసించిన 20 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చి 'టెక్నికల్ అనాలిసిస్ వింగ్'ని ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా చోరీకి గురైన, ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కనుగొని రికవరీ చేశామన్నారు. చోరీకి గురైన మొబైల్ ఫోన్లను అసాంఘిక కార్యకలాపాలకు వాడుకునే అవకాశాలు ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే సంబంధిత వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇదీ చదవండి
చిత్తూరు జిల్లాలో 277 మొబైల్ ఫోన్లు స్వాధీనం - chittor district latest crime news
30 రోజుల వ్యవధిలో చోరీకి గురైన, పోగొట్టుకున్న 277 మొబైల్ ఫోన్లను చిత్తూరు జిల్లా పోలీసులు రికవరీ చేశారు. తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ద్వారా వీటిని గుర్తించామని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు.
cell phones