చిత్తూరు జిల్లాలో ఇరుక్కుపోయిన వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపుతున్నామని కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా అన్నారు. దాదాపు ఎనిమిది వేల మందిని ప్రత్యేక రైళ్ల ద్వారా వారి సొంత రాష్ట్రాలకు పంపామన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్‌లకు రెండు చొప్పున, ఒడిశాకు ఒక రైలు ద్వారా కూలీలను తరలించామని తెలిపారు. మరో రెండు రోజుల్లో ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు మరో రెండు రైళ్ల ద్వారా కూలీలను తరలించనున్నామన్నారు.
సొంత గూటికి చేరుకున్న సుమారు 8 వేల మంది వలస కూలీలు
ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా నుంచి సుమారు 8 వేల వలస కార్మికులను తమ స్వస్థలాలకు పంపించామని కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా తెలిపారు. తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి 20 వేల మంది వరకు దరఖాస్తులు చేసుకొన్నారని.., ఆయా రాష్ట్రాల అనుమతి లేక ఆలస్యమవుతోందన్నారు.
చిత్తూరు జిల్లాలో వలస కూలీలు
వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి 20 వేల మంది వరకు దరఖాస్తులు చేసుకొన్నారని....ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం లేకపోవడంతో సొంత రాష్ట్రాలకు తీసుకెళ్లడంలో ఆలస్యమవుతోందని వివరించారు.
ఇదీ చదవండి : అలసిపోయిన పాదాలు.. బరువెక్కిన గుండెలు!