కరోనా రోగులకు సరైన వైద్యం అందడం లేదనే ఫిర్యాదులు రాకూడదని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిపుణల కమిటీ పర్యవేక్షణలో కొవిడ్ బాధితుల అవసరాలు గుర్తించాలని సూచించారు. నియోజకవర్గానికి ఒక కొవిడ్ కేర్ కేేంద్రాన్ని ఏర్పాటు చేేయాలని ఆదేశించారు.
ప్రస్తుత పరిస్థితులలో కొవిడ్ ఆసుపత్రులు, కేర్ సెంటర్లలో డాక్టర్ల పర్యవేక్షణ పెంచాలని కలెెెక్టర్ తెెెెెెలిపారు. బాధితుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. మరణాల సంఖ్య తగ్గించేందుకు కృషి చేయాలని ఆదేేేేేేశించారు.
నియోజకవర్గానికో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి: కలెక్టర్ - కొవిడ్ కేర్ కేంద్రాల్లో సౌకర్యాలు
చిత్తూరు జిల్లాలో కొవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. బాధితుల అవసరాలు గుర్తించి దేనికీ కొరత లేకుండా చూడాలని సూచించారు.

చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్, కొవిడ్ కేర్ కేంద్రాల్లో సౌకర్యాలు