ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చెత్త నుంచి సంపద కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలి' - చెత్త నుంచి సంపదపై వార్తలు

చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా సూచించారు. బి.కొత్తకోట మండలం బడికాయల పల్లి పంచాయతీ గ్రామ సచివాలయాన్ని, చెత్త నుంచి సంపద తయారు చేసే బృందావనాన్ని కలెక్టర్‌ పరిశీలించారు.

chittor collector on waste management
బడికాయల పల్లి చెత్త నుంచి సంపద కేంద్రంలో కలెక్టర్

By

Published : Oct 16, 2020, 8:39 PM IST

గ్రామస్థాయిలోనూ పారిశుధ్య కార్మికుల ద్వారా ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్తను సేకరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ఆదేశించారు. బి.కొత్తకోట మండలం బడికాయల పల్లి పంచాయతీ గ్రామ సచివాలయాన్ని, చెత్త నుంచి సంపద తయారు చేసే బృందావనాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం సచివాలయాన్ని పరిశీలించారు.

వినతిపత్రాలు అధికంగా వచ్చే సమస్యలను డేటా ఆపరేటర్‌ను అడిగి తెలుసుకొన్నారు. వినతిపత్రాలు వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరించాలని, పరిష్కారం కానీ సమస్యలను ఎందుకు పరిష్కారం కాలేదో వినతిపత్రాలు ఇచ్చిన వారికి తెలియచేయాలని సూచించారు. రాష్ట్రప్రభుత్వం ఆమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను సచివాలయ నోటీస్‌ బోర్డులో పెట్టాలన్నారు.

ఇదీ చదవండి:దుర్గ గుడి పైవంతెన ప్రారంభం.... వర్చువల్​గా పాల్గొన్న జగన్​, గడ్కరీ

ABOUT THE AUTHOR

...view details