ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 6, 2020, 8:12 PM IST

ETV Bharat / state

'స్విమ్స్​లో తెలుగు రాష్ట్రాల కొవిడ్ 19 నిర్ధరణ పరీక్షలు'

తిరుపతి స్విమ్స్​లో తెలుగు రాష్ట్రాల కొవిడ్ 19 కేసుల నిర్ధరణ పరీక్షలు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా చెప్పారు. కరోనా నియంత్రణ చర్యలపై జిల్లా స్థాయి టాస్క్​ఫోర్స్ ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో పాజిటివ్ కేసుల నమోదైన ప్రాంతాల్లో డిస్​ఇన్ఫెక్షన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. లాక్​డౌన్ పొడిగింపు ఎటువంటి సమాచారం లేదన్న ఆయన... సున్నితపు ప్రాంతాల్లో కొన్ని నిబంధనలు ఉండే అవకాశం ఉందన్నారు.

chittor collector bharat gupta
చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా

చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా మీడియా సమావేశం

తిరుపతి స్విమ్స్​లో కేవలం చిత్తూరు జిల్లానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల కొవిడ్ 19 పరీక్ష ఫలితాలను నిర్ధరిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా తెలిపారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి టాస్క్​ఫోర్స్ సమావేశాన్ని ఏర్పాటుచేసిన ఆయన... కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడిన కలెక్టర్... 2 రాష్ట్రాల నుంచి వచ్చే నమూనాలను తిరుపతి స్విమ్స్​లో పరిశీలిస్తుండటం వల్ల సిబ్బంది కొరత ఎదురవుతుందన్నారు. ఆ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను డిస్​ఇన్ఫెక్షన్ చేస్తున్నామని తెలిపారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్​ను గుర్తించి ఐసోలేషన్​కు తరలిస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details