కరోనా నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జేసీ సహా 26 మంది జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ భరత్‌గుప్తా ఆదేశాలిచ్చారు. వీరు రాష్ట్ర, జిల్లా కొవిడ్ ఆసుపత్రుల పర్యవేక్షణ మొదలు.. సామగ్రి పంపిణీ, క్వారంటైన్ కేంద్రాలు, పునరావాస శిబిరాలు, శాంపిళ్ల సేకరణ, ఇంటింటి సర్వే, నిత్యావసరాల సరఫరా, మొబైల్ రైతుబజార్ల పర్యవేక్షణ, బయోవేస్ట్ తరలింపును పర్యవేక్షించి కలెక్టర్‌కు నివేదించాల్సి ఉంటుంది.
జిల్లాలో ఏడు రెడ్‌జోన్‌లు
కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ఏడు ప్రాంతాలను అధికారులు రెడ్‌జోన్లుగా శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఆయా ప్రాంతాలపై నిరంతరం నిఘా పెడుతున్నారు. పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల పరిధిని కంటైన్మెంట్ క్లస్టర్‌గా, ఐదు కిలోమీటర్ల ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా ప్రకటించారు. అవసరం మేరకు స్థానికంగా వైద్య సేవలు అందిస్తూ ఎవరూ బయటకు వెళ్లకుండా చూస్తున్నారు.
సహాయ శిబిరాల్లో 1707 మంది
జిల్లాలో ఏర్పాటుచేసిన 27 సహాయక శిబిరాల్లో రాష్ట్రేతరులు, ఇతర జిల్లాల వారు 1707 మంది ఉన్నారు. క్వారంటైన్ కేంద్రాల నుంచి శుక్రవారం 86 మంది డిశ్చార్జి అయ్యారు. 25 మంది కొత్తగా చేరారు. మొత్తం 363 మంది క్వారంటైన్‌లో ఉన్నారని జేసీ - 2, కొవిడ్ - 19 జిల్లా నోడల్ అధికారి చంద్రమౌళి తెలిపారు.
కొవిడ్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య చర్యలు