చిత్తూరు జిల్లా కుప్పం చీగలపల్లెలో బాలుడి మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి కాజేసేందుకు బాలుడి బావ రాఘవేంద్రే హత్య చేసినట్లు నిర్ధరించారు. బాలుడు వెంకటాచలపతిని చంపితే మొత్తం భూమి తనకే దక్కుతుందనే దురాశతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. రాఘవేంద్రను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఏం జరిగిందంటే...
చీగలపల్లి శివార్లలోని జొన్నతోటలో ఓ బాలుడి మృతదేహం లభించింది. మృతుడు గ్రామానికి చెందిన వెంకటేశ్ కుమారుడు వెంకటాచలపతి(7)గా గుర్తించారు. ఉగాది పూజ కోసం మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన బాలుడు సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. వెతకటం ప్రారంభించిన అతని బంధువులకు.. గ్రామశివార్లలో మృతదేహం కనిపించింది. బాలుడి ముఖం, శరీరంపై రక్తపు గాయాలు చూసి హత్యగా అనుమానించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవాళ నిందితుడు రాఘవేంద్రను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:
అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి