ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ ఉడకని అన్నం మాకొద్దు.. మధ్యాహ్న భోజనాన్ని పడేసిన విద్యార్థులు.. - ap mid day meals

chittoor: చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తినేందుకు విద్యార్థులు నిరాకరించారు. ఉడకని భోజనం మాకొద్దని.. పడేశారు. ఈ అన్నం తినడం వల్ల తాము అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు అంటున్నారు. నిర్వాహకులకు భోజనం వండటంలో అనుభవం లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.

మధ్యాహ్న భోజనాన్ని పడేసిన విద్యార్థులు
మధ్యాహ్న భోజనం

By

Published : Nov 5, 2022, 9:23 AM IST

Updated : Nov 5, 2022, 12:56 PM IST

Midday meals in chittoor: చిత్తూరు జిల్లా వికోట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉడకని భోజనం మాకొద్దంటూ విద్యార్థులు పడేశారు. శుక్రవారం మధ్యాహ్నం వండిన భోజనం ఉడకలేదని ఇది తినడం వల్ల తాము అనారోగ్యం పాలవుతున్నామని.. విద్యార్థులు తినకుండా పక్కన పడేశారు. ఉడకని అన్నం.. సగం ఉడికిన కోడిగుడ్డులు తినలేక చెత్తకుప్పలో పడేశారు.

ఇలాంటి ఉడికి ఉడకని భోజనాన్నిపెడితే పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. గత మూడు రోజులుగా మధ్యాహ్న భోజనం ఎలా వున్నా ఉపాధ్యాయులు పట్టించుకోలేదని విద్యార్థులు అంటున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ పాఠశాలలో 10 ఏళ్లుగా మధ్యాహ్న భోజనం వండేవారిని తొలగించి, ఇటీవల కొత్త నిర్వాహకులకు మధ్యాహ్న భోజనం పనిని అప్పగించారు. నిర్వాహకులకు భోజనం వండటంలో అనుభవం లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆరు వందల మంది విద్యార్థులున్న పాఠశాలలో.. అనుభవం లేని వారికి పనిని అప్పగిస్తే ఎలా అని తల్లిదండ్రులు అంటున్నారు. కొంత మంది అధికారులు,నేతలు వారి స్వప్రయోజనాల కోసం.. మధ్యాహ్న భోజనంతో ఆటలాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మధ్యాహ్న భోజనాన్ని పడేసిన విద్యార్థులు

ఇవీ చదవండి:

Last Updated : Nov 5, 2022, 12:56 PM IST

ABOUT THE AUTHOR

...view details