జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజులోనే 135 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించామని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా.. పుత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలీసులు కాపాడిన వీధి బాలల గురించి ఆయన వివరాలు తెలుసుకున్నారు.
చిత్తూరులో సంతృప్తికరంగా ఆపరేషన్ ముస్కాన్ మొదటిరోజు - ఆపరేషన్ ముస్కాన్పై ఎస్పీ సెంథిల్ కుమార్ విలేకరుల సమావేశం
చిత్తూరులో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో.. బాల కార్మికులను కాపాడేందుకు పోలీసులు నడుం బిగించారు. ఒక్కరోజులోనే 135 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు.
బాలకార్మికులకు శానిటైజర్ అందచేస్తున్న ఎస్పీ
డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు.. రెండు రోజులపాటు జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభించామని ఎస్పీ తెలిపారు. బాల కార్మికులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే.. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాపాడిన పిల్లలకు కొవిడ్ పరీక్షలు చేయించి.. అవసరమైతే చికిత్స అందిస్తామని వెల్లడించారు. రేపటితో ఈ కార్యక్రమం ముగియనుండగా.. పూర్తి వివరాలు అప్పడు తెలియచేస్తామన్నారు.
ఇదీ చదవండి:'నకిలీ పత్రాలతో రూ.50 లక్షలు మాయం'