ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శేషాచల అడవుల్లో కూంబింగ్...32 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

చిత్తూరు జిల్లా భాకరాపేట శేషాచల అడవుల్లో టాస్క్​ఫోర్స్ అధికారులు, పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ కూంబింగ్​లో అధికారులు 32 ఎర్రచందనం దుంగలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కాటిక కనుమ వద్ద నుంచి నారేడుపెంట సమీపంలో కూంబింగ్ చేయగా...వారికి ఎర్రచందనం స్మగ్లర్లు ఎదురయ్యారు. పోలీసులను చూసి ఎర్ర చందనం దుంగలను వదిలి, దొంగలు పరారయ్యారు.

red sandalwood
red sandalwood

By

Published : Oct 16, 2020, 7:50 PM IST

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోని భాకరాపేట శేషాచల అడవుల్లో టాస్క్​ఫోర్స్ అధికారులు, భాకరాపేట పోలీసులు కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం ఉదయం చేపట్టిన దాడుల్లో 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. భాకరాపేట నుంచి తలకోన ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులు దేవరకొండ ప్రాంతంలో ఒక కారుతో పాటుగా 12 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ఫోర్స్ అధికారులకు కాటిక కనుమ వద్ద నుంచి నారేడుపెంట సమీపంలోని దట్టమైన అడవుల్లో కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలతో కనిపించారు. అయితే స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ బృందాన్ని గమనించి, దుంగలను పడేసి పారిపోయారని అధికారులు చెప్పారు.

దుండగులను కొంతమంది టాస్క్​ఫోర్స్ సిబ్బంది వెంబడించారు. ఆ ప్రాంతంలో 20 ఎర్రచందనం దుంగలు లభించాయని డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. మొత్తం 32 ఎర్రచందనం దుంగలను, ఒక కారును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సంఘటన స్థలానికి సీఐ సుబ్రహ్మణ్యం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :హత్యకు గురైన విజయవాడ యువతి అంత్యక్రియలు పూర్తి

ABOUT THE AUTHOR

...view details