ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇద్దరు చైన్​స్నాచర్ల అరెస్ట్.. రూ.10 లక్షల విలువైన నగలు స్వాధీనం.. - చైన్​ స్నాచర్స్​ నుంచి రూ.10 లక్షల విలువైన నగలు స్వాధీనం

వాహనాలను తనిఖీల్లో ఇద్దరు చైన్​ స్నాచర్లను చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి రూ. 10 లక్షలు విలువైన బంగారు నగలు, ఒక వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

police arrested two chain snatchers in chittoor district and recovered gold
వాహనాలను తనిఖీల్లో ఇద్దరు చైన్​ స్నాచర్ల అరెస్ట్​

By

Published : Jan 23, 2021, 10:17 PM IST

చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ నేరాలపై పోలీసులు దృష్టి పెట్టారు. కేసుల శోధనలో భాగంగా గుడిపాల, యాదమరి ఎస్సైలు వాహనాలను తనిఖీస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులో తీసుకొని విచారించారు. వీరు చైన్ స్నాచింగ్ ముఠాకు చెందిన వారని పోలీసులు గుర్తించారు.

ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారిని వెనక నుండి వెంబడించి.. మహిళల మెడలో నుంచి నగలను లాక్కొని పారిపోయేవారని పోలీసులు తెలిపారు. వీరు గతంలో ఏడు కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నారని చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. నిందితులు తజముల్ పాషా, మహమూద్ సయీద్​ లను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: పుత్తూరులో పార్క్​కు ఎమ్మెల్యే రోజా శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details