కరోనా భయం: బంధువు మృతదేహం ఊరి చివరే! - చిత్తూరు కరోనా వార్తలు
09:31 April 30
కాలినడక ఊరికొచ్చిన వ్యక్తి మృతి
చిత్తూరు జిల్లా రామసముద్రంలో దారుణం చోటుచేసుకుంది. కరోనా లాక్డౌన్ కారణంగా బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా రామసముద్రానికి కాలినడకన వచ్చిన ఓ వ్యక్తి.... ఊరి శివారు ప్రాంతంలో అనారోగ్యంతో కన్నుమూశాడు. మృతుడిని రామసముద్రానికి చెందిన 28ఏళ్ల హరిప్రసాద్గా అధికారులు గుర్తించారు. అతనికి కరోనా సోకి ఉంటుందన్న అనుమానంతో గ్రామస్తులు మృతదేహం దగ్గరికి వెళ్లేందుకు వెనుకాడారు. మృతుడి నుంచి నమూనాలు సేకరించి అధికారులు పరీక్షలు నిర్వహించగా.. కరోనా నెగటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. కాలినడకన చాలా దూరం ప్రయాణించటం వలన అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని వైద్యులు ధృవీకరించారు. అనంతరం బంధువులు అతని మృతదేహానికి అంత్యక్రియలు చేశారు.
ఇదీ చదవండి : స్వస్థలాలకు వెళ్లేందుకు.. కేంద్రం మార్గదర్శకాలు