చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ వర్దంతి సందర్బంగా చంద్రగిరి మండలం అగరాల వద్ద ఆయన కుటుంబసభ్యులు ఘన నివాళులర్పించారు. ప్రత్యేక హోదా కోసం వివిధ రకాల వేషధారణలతో నిరసన తెలిపి.. శివప్రసాద్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని తెదేపా నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి మండల తెదేపా ప్రధాన కార్యదర్శి గంగపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మాజీ ఎంపీ శివప్రసాద్ వర్దంతి..ఘన నివాళులు
చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ వర్దంతిని ఆయన కుటంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా నేతలు చంద్రగిరిలో టవర్ క్లాక్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మాజీ ఎంపీ శివప్రసాద్ సంవత్సరీకం