శ్రీకాళహస్తి మాడవీధుల్లో స్వామి అమ్మవార్ల ఊరేగింపు - latest news of srikalahasthi temples
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రుషి రాత్రిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి, అమ్మవార్లు అశ్వ, సింహ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణాభరణాల అలంకరణలో వాహనాలను అధిరోహించిన శ్రీ వాయి లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి మాడవీధుల్లో ఊరేగారు. భక్తుల కోలాటాలు, వాయిద్యాలు, నృత్యాలతో అలరించారు. ఆది దంపతుల ఉత్సవాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడం వల్ల శ్రీకాళహస్తి శివనామ స్మరణతో మారుమ్రోగింది.