చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మదనపల్లి పలమనేరు కుప్పం, నగరి, పుత్తూరు ఆస్పత్రుల్లో ఏర్పాటుకు గల సౌకర్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తిరుపతి రుయా ఆసుపత్రిలో రోగుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపామని అవసరమైతే పరికాల ఏర్పాటుచేసి రోగులకు ఇక్కడ వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ - puthoor hospital taja news
చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిని కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా బాధితులకు ఇక్కడే వైద్యం అందించే ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.

chittoor dst collecotr vits puthoor hospital