చిత్తూరు జిల్లా చైతన్యపురం గ్రామంలో తెల్లవారుఝామున వచ్చిన ఏనుగులు... పొలాల్లో తిరుగుతూ పంటను నాశనం చేశాయి. రైతులకు చేతికి అందిన పంటను సుమారు పది ఏనుగులతో కూడిన గుంపు తొక్కేసింది. పూర్తిగా ధ్వంసం చేసింది. మండలంలోని మామండూరు, గుండ్లల కలవ గ్రామాల సమీపంలోని పొలాలు, మామిడితోటలు, అరటి తోటలపై సుమారు 10 ఏనుగులు రాత్రి వేళల్లో వచ్చి విచ్ఛలవిడిగా తిరుగుతున్నట్టు రైతులు చెబుతున్నారు. తమ పొలాలకు రాత్రిళ్లు నిద్ర మానుకుని కాపలా కాయాల్సి వస్తోందని ఆవేదన చెందారు. అటవీ అధికారులు సత్వరమే స్పందించి.. తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పొలాల్లోకి ఏనుగులు.. పూర్తిగా ధ్వంసమైన పంటలు - Chittoor District Renigunta Manda
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం చైతన్యపురం గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పంటను తొక్కేసిన గజరాజులు.. రైతన్నలకు భారీ నష్టాన్ని మిగిల్చాయి.
Chittoor District Renigunta Mandal:A group of elephants in Chaitanya Puram village has created a riot