ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో ఎన్నికలపై అధికారుల పర్యవేక్షణ

చిత్తూరు జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై అధికారులు దృష్టి పెట్టారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దంటూ సిబ్బందికి సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియను ఉన్నతాధికారులు పరిశీలించారు.

By

Published : Jan 31, 2021, 6:40 PM IST

election checking by chittoor officials
చిత్తూరు జిల్లాలో ఎన్నికలపై అధికారుల పర్యవేక్షణ

చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ పరిధిలో రెండు చోట్ల ఎన్నికలు జరిగే ప్రాంతాలను.. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడు పరిశీలించారు. ఇవాళ తిరుపతి అర్బన్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తిరుమల దర్శనం అనంతరం.. నేరుగా ఆర్సీపురం మండల కార్యాలయంలో జరిగే నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు.

ప్రశాంతంగా ఎన్నికలకు చర్యలు..

పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న రెండు చోట్లా నామినేషన్ ప్రక్రియ శాంతి భద్రతల మధ్య కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. రామచంద్రపురం, వడమాలపేటలో జరిగే ఎన్నికలను కట్టుదిట్టమైన భద్రత మధ్య.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో, చట్టపరంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు చేపట్టిన భద్రతా చర్యలను ఎస్పీకి వివరించారు.

విధినిర్వహణలో నిర్లక్ష్యం వద్దు..

స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దని చిత్తూరు జిల్లా సబ్ కలెక్టర్ జాహ్నవి సూచించారు. సబ్​కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. నామినేషన్ పత్రాలు స్వీకరణ పరిశీలన, ఉపసంహరణ వంటి అంశాలపై ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అందరూ పని చేయాల్సి ఉంటుందని.. ఎవరైనా విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

ఇదీ చదవండి:

తెదేపా ఎమ్మెల్సీ దొరబాబు వాహనంపై దాడి

ABOUT THE AUTHOR

...view details