ఇంటికి తాళం వేసిన సమయంలో నిఘా వేసి.. దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీసులు అరెస్టు చేశారు. కొన్నినెలలుగా మదనపల్లిలో ఇలాంటి చోరీ ఘటనలు జరుగుతుండటంతో.. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ ఆచారి తెలిపారు. వారు నరసింహులు, సాయి కుమార్ అనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12 కేసుల్లో కలిపి 531 గ్రాముల బంగారు హారం, ఆరున్నర కేజీలవెండి, రెండు మోటార్ సైకిళ్లు, రెండు టీవీలు రికవరీ చేసుకున్నామన్నారు. వీటి విలువ 20 లక్షల 99 వేల 810 రూపాయలు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు.
తాళం వేసిన ఇళ్లలో చోరీ.. ఇద్దరు దొంగలు అరెస్ట్ - Home burglars arrested in Madanapalle
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని.. చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
ఇద్దరు దొంగలు అరెస్ట్