ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​ : చిత్తూరు జిల్లాలో జన దిగ్బంధం - chittoor district lockdown due to corona effect

లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా చిత్తూరు జిల్లాలో ప్రజలు వీధుల్లోకి రాకుండా పోలీసులు నియంత్రించారు. కొన్ని చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించారు. వైరస్​ వ్యాప్తి దృష్ట్యా ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు.

chittoor district lockdown details
చిత్తూరు జిల్లాలో లాక్​డౌన్​

By

Published : Mar 26, 2020, 10:40 PM IST

శ్రీకాళహస్తిలో

శ్రీకాళహస్తిలో కరోనా నివారణను కాంక్షిస్తూ హోమం నిర్వహణ

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించాలనే లక్ష్యంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయహోమం నిర్వహించనున్నారు. ఈ నెల 30 వరకు జరిగే పూజలకు అంకురార్పణ చేశారు. ఆలయంలోని మృత్యుంజయస్వామికి వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య హోమం చేశారు.

గాండ్లపల్లి

చిత్తూరు జిల్లా పీలేరు మండలం గాండ్లపల్లిలో కరోనా వ్యాప్తి నివారణకు గ్రామస్థులు ఏకమయ్యారు. ముళ్ల కంచెను అడ్డుగా వేసి తమ గ్రామానికి రాకపోకలు నిలిపేశారు. ప్రసార మాధ్యమాల ద్వారా కరోనా తీవ్రతను గురించి తెలుసుకుని ఆందోళనకు గురయ్యామని గ్రామస్థులు పేర్కొన్నారు.

మదనపల్లిలో

మదనపల్లిలో లాక్​డౌన్​

చిత్తూరు జిల్లా మదనపల్లిలో లాక్​డౌన్​లో భాగంగా ప్రజలు వీధుల్లోకి రాకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. లాక్ డౌన్ చేపట్టి నాలుగో రోజు కావడంతో నిత్యావసర సరుకుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకు నిత్యావసర సరుకులు కొనుగోలుకు అవకాశం కల్పించినా.. దుకాణాలు మాత్రం తెరుచుకోలేదు. మరోవైపు పురపాలక సంఘం అధికారులు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కరోనా ఎఫెక్ట్ : విశాఖ జిల్లాలో పూర్తిస్థాయి లాక్​డౌన్

ABOUT THE AUTHOR

...view details