ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివర్ ఎఫెక్ట్: పురుగుల మందు తాగిన కౌలు రైతు మృతి

నివర్ తుపాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లా పుంగనూరులో పంటలు దెబ్బతిన్నాయి. ఎంతో వ్యయప్రయాసాలు పడి పంటకు చేతికొచ్చే సమయానికి రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. అంతకు ముందు కరోనా ప్రభావంతో పంటలు అమ్ముకునేందుకు లేక విలవిల్లాడిన రైతన్నలను తుపాను పెను ప్రమాదంలోకి నెట్టేసింది. మనస్తాపంతో పుంగునూరు మండలం మద్దనపల్లెకు చెందిన రైతు పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

నివర్ ఎఫెక్ట్: పురుగుల మందు తాగిన కౌలు రైతు మృతి
నివర్ ఎఫెక్ట్: పురుగుల మందు తాగిన కౌలు రైతు మృతి

By

Published : Dec 3, 2020, 10:03 PM IST


నివర్ తుపాన్ చిత్తూరు జిల్లాలో ఓ రైతు ప్రాణాలను బలిగొంది. పుంగనూరు మండలం మద్దనపల్లెకు చెందిన కుమార్ అనే కౌలురైతు నవంబర్ 28న ఆత్మహత్య యత్నం చేయగా మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశాడు. బంగాళాదుంప, టమోటా పంటల సాగుకు రూ.15లక్షలు కుమార్ అప్పు చేయగా కరోనా, నివర్ తుపాను పంటలను పూర్తిగా దెబ్బతీసాయి. మనస్తాపం చెందిన ఆయన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించగా మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు వదిలాడు.

ABOUT THE AUTHOR

...view details