చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. బుధవారం ఒక్కరోజే జిల్లాలో 345 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 5668 కి చేరుకుంది. కరోనాతో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోవటంతో... మృతుల సంఖ్య 64కి చేరుకుంది. తిరుపతిలోనే ఎక్కువగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో... 14 రోజులపాటు నగరంలో లాక్డౌన్ విధించారు.
చిత్తూరులో రోజురోజుకి పెరుగుతున్న కరోనా బాధితులు - chiitoore corona news
చిత్తూరు జిల్లాలో కరోనా రోజురోజుకి విస్తరిస్తోంది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో జిల్లా వ్యాప్తంగా 345 మందికి కరోనా నిర్థరణ అయ్యినట్లు వెల్లడించారు. మరో ఐదుగురు కరోనాతో ప్రాణాలు విడిచినట్లు స్పష్టం చేశారు.
చిత్తూరులో రోజురోజుకి పెరుగుతున్న కరోనా బాధితులు
దుకాణాలకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి ఉన్నట్లు స్పష్టం చేశారు. తిరుమల బైపాస్ రోడ్‌కి మాత్రం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల నుంచి..3,083 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోవటంతో 2,521 యాక్టివ్ కేసులు జిల్లాలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.