ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ సంచలన నిర్ణయం - Chittoor District Collector sensational decision news

చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 5 మండలాల ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్యశాఖ ఉద్యోగుల, సచివాలయం, మున్సిపల్ శాఖ ఉద్యోగుల జీతాలు నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. జీతాలు నిలిపేయాలని జిల్లా ట్రెజరీకి ఆదేశాలిచ్చారు.

చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్
చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్

By

Published : May 18, 2021, 10:44 PM IST

చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 మండలాల ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. పెదమండ్యం, తవణంపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె మండలాల ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేస్తూ... నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్యశాఖ ఉద్యోగుల, సచివాలయం, మున్సిపల్ శాఖ ఉద్యోగుల జీతాలు నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆరో విడత ఫీవర్ సర్వేలో అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వులో వెల్లడించారు. ఆదేశాలు పట్టించుకోని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీతాలు నిలిపేయాలని జిల్లా ట్రెజరీకి ఆదేశాలిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details