చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కర్ణాటక నుంచి జోగివాణి బురుజు ప్రాంతానికి వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్‌గా తేలింది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు.. ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. దాదాపు ఓ కిలోమీటరు వరకు రెడ్‌జోన్‌గా ప్రకటించారు.
ప్రజలంతా నిబంధనలు పాటించి.. కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని ఎంపీడీవో దివాకర్ రెడ్డి, ఎస్సై సహదేవి, తాహసీల్దార్ రవీందర్ రెడ్డి, వైద్యాధికారి నిరంజన్ రెడ్డి కోరారు.