చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో... నెట్వర్క్ ఆసుపత్రులలోనూ వైద్యం అందించేందుకు ప్రైవేటు వైద్యులు ముందుకు రావాలని కలెక్టర్ భరత్ గుప్తా కోరారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ప్రైవేటు వైద్యులతో సమావేశమైన కలెక్టర్.. ఇప్పటికే శ్రీనివాసం, విష్ణునివాసం, రుయా, ఈఎస్ఐ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా బాధితులకు వైద్య సేవల కోసం పడకల సామర్థ్యం పెంచేలా... నెట్వర్స్ ఆసుపత్రులు సైతం ముందుకు రావాలని కోరారు. ప్రైవేటు డాక్టర్లు స్వచ్చందంగా ముందుకు వచ్చి కొవిడ్ రోగులకు వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
'ప్రైవేటు వైద్యులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి' - chittore collector bharat guptha latest news
కరోనా బాధితులకు వైద్యం చేసేందుకు ప్రైవేటు డాక్టర్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ కోరారు. ప్రైవేటు వైద్యులతో సమావేశమైన ఆయన, నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ కొవిడ్‌కు చికిత్స అందించాలన్నారు.

ప్రైవేటు వైద్యులతో చిత్తూరు కలెక్టర్ సమావేశం