ప్రైవేట్ ఆస్పత్రిలో నిర్ధరణ అయ్యే కరోనా పాజిటివ్ ఫలితాలను సంబంధిత నోడల్ అధికారికి తప్పనిసరిగా అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశించారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో తిరుపతి ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందన్నారు. పాజిటివ్ జాబితాను ఆయా ఆస్పత్రుల యాజమాన్యం జిల్లా అధికారులకు అందజేస్తే, ఆ వ్యక్తి నివసించే ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ఏర్పాటు చేసి చర్యలు తీసుకునే వీలుంటుందని అన్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో కలెక్టర్ సమావేశం - ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో సమావేశం
చిత్తూరు కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా తిరుపతి ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్ధరణ అయ్యే కరోనా పాజిటివ్ ఫలితాల వివరాలను నోడల్ అధికారికి తప్పనిసరిగా అందిచాలన్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో చిత్తూరు కలెక్టర్ సమావేశం