చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం గుంతవారిపల్లిదిన్నెలో తీవ్ర విషాదం జరిగింది. మినికి చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పశువులను మేతకు తీసుకెళ్లిన విజయ్, యశ్వంత్, నాగభూషణం... రామాపురం పక్కనున్న మినికి చెరువులో ప్రమాదవశాత్తూ పడి చనిపోయినట్లు తెలిసింది.
చెరువులో మునిగి.. ముగ్గురు పిల్లలు మృతి - Chittoor district accident news
చెరువులో మునిగి ముగ్గురు పిల్లలు మృతి
18:21 November 29
చిత్తూరు: రామసముద్రం మండలం రామాపురంలో విషాదం
అన్నదమ్ములైన విజయ్, యశ్వంత్ ఒకేసారి మరణించడం.. ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు.
ఇవీ చదవండి:
Last Updated : Nov 29, 2020, 6:58 PM IST