మరో వారం రోజుల్లో ఆ యువతి పెళ్లి. ఇంతలోనే దారుణం జరిగింది. ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించారు దుండగలు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గట్టుకిందపల్లిలో జరిగింది.
వారం రోజుల్లో పెళ్లి... ఇంతలో హత్యాయత్నం! - గట్టుకిందపల్లిలో హత్యాత్నం వార్తలు
08:48 December 17
నిద్రిస్తున్న యువతిపై హత్యాయత్నం!
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం గట్టుకిందపల్లిలో ఓ యువతిపై హత్యాయత్నం జరిగింది. ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఘటనలో యువతికి తీవ్ర గాయాలు పాలవటంతో.. మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
యువతిపై హత్యాయత్నం జరిగినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి మరో వారం రోజుల్లో వివాహం జరగనుండగా.. ఈ ఘటన జరగటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
" ఇంటి దగ్గర పెంచుకుంటున్న కుక్కలు మెురగకుండా విష ప్రయోగం చేశారు. తరువాత మా కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు"- బాధితురాలి తండ్రి.
ఇదీ చదవండి: పొలం దున్నుతుండగా.. ట్రాక్టర్ పైనుంచి పడి బాలుడి మృతి