ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరామ్ నియామకం - telugu yuvatha state president

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లాకు చెందిన బీసీ నేత శ్రీరామ్ నియమితులయ్యారు. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేస్తానని శ్రీరామ్ పేర్కొన్నారు.

chithore district resident sriram appointed as telugu yuvatha state president
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరామ్ నియామకం

By

Published : Jan 12, 2021, 3:03 AM IST

తెదేపా యువజన విభాగం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గానికి చెందిన బీసీ నేత గుండ్లపల్లి శ్రీరామ్ (చినబాబు) నియమితులయ్యారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. శ్రీరామ్ గతంలో అఖిల భారత చేనేత బోర్డు డైరెక్టర్​గా, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా పని చేశారు. రాష్ట్ర తొగటవీర క్షత్రియ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పని చేస్తానని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామ్ అన్నారు. బీసీలను గుర్తించి తనను తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీకి రుణపడి ఉంటానని అన్నారు. యువతను పార్టీ వైపు మళ్లించే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో కొత్తగా 121 కరోనా కేసులు... ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details