చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం జిల్లావాళ్లపల్లె గ్రామ ప్రజలు... చేయీ చేయీ కలిపి శ్రమదానంతో రోడ్డుకు మరమ్మతులు చేసుకున్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామ రహదారి దెబ్బతింది.
పక్కనే ఉన్న చెరువుకు నీళ్లు వెళ్లే మార్గం మూసుకుపోయింది. గ్రామ, మండల స్థాయి అధికారులకు సమస్య తెలిపినా... ప్రయోజనం లేని పరిస్థితుల్లో విరాళాలు పోగు చేసి, రోడ్డును బాగు చేసుకున్నామని గ్రామస్థులు తెలిపారు.