ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో చిరుతపులి సంచారం..! - తిరుమలలో చిరుతపులి సంచారం

తిరుమలలోని బాలాజీ నగర్​లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులకు సమాచారం అందింది. అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. డప్పుల శబ్దంతో చిరుతపులిని తరిమే ప్రయత్నం చేశారు.

chirutha-in-tirumala-in-ap
chirutha-in-tirumala-in-ap

By

Published : Apr 17, 2020, 9:21 AM IST

తిరుమలలో వన్యప్రాణుల సంచారంతో స్థానికులు, ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతం నుంచి జనావాసాలలోకి చిరుతలు, ఎలుగుబంట్లు, రేచుకుక్కలు ప్రవేశిస్తున్నాయి. స్థానికుల నివాస ప్రాంగణం బాలాజీ నగర్​లో చిరుతపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న సిబ్బంది డప్పుల శబ్దంతో తరిమే ప్రయత్నంచేశారు. స్థానికులను అప్రమత్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details