ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇచ్చట చైనా వస్తువులు అమ్మబడవు' - పలమనేరులో చైనా వస్తువుల బహిష్కరణ నినాదం

చిత్తూరు జిల్లా పలమనేరులో తన దుకాణంలో 'చైనా వస్తువులు అమ్మబడవు' అంటూ బ్యానర్ కట్టి స్ఫూర్తిని చాటాడు ఓ యువకుడు. చైనా సైనికులు మన జవాన్లను చంపిన కారణంగా ఊపందుకున్న స్వదేశీ నినాదానికి తన వంతు సహకారం అందిస్తున్నాడు.

china items expulsion in one shop in palamaneru chittore district
బ్యానర్ పెట్టిన దుకాణం యువకుడు

By

Published : Jun 17, 2020, 10:40 PM IST

తన దుకాణంలో 'చైనా వస్తువులు అమ్మబడవు' అంటూ బ్యానర్ కట్టి స్ఫూర్తిని చాటాడు ఓ యువకుడు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ సమీపంలోని గుండుబావి ఎదురుగా ఓ యువకుడు పెయింట్, ఎలక్ట్రికల్, హార్డ్ వేర్ దుకాణం నడుపుతున్నాడు. సరిహద్దుల్లో చైనా కారణంగా మన జవాన్లు వీర మరణం పొందిన నేపథ్యంలో దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలనే నినాదం ఊపందుకుంది.

దీంతో తన షాపులో ఆ దేశ వస్తువులు విక్రయించడం ఆపేశాడు. మరింత మందికి స్ఫూర్తినిచ్చే ఉద్దేశంతో తన దుకాణం ఎదుట 'ఇక్కడ చైనా వస్తువులు అమ్మబడవు' అని రాసి ఉన్న బ్యానర్ ఏర్పాటుచేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details