Infant Missing: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పసికందు అదృశ్యం
09:45 March 19
Infant Missing: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పసికందు అదృశ్యం
Infant missing : చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రసూతి వార్డులో మగ శిశువు అదృశ్యం కావడం కలకలం రేపింది. శనివారం ఉదయం వేకువజామున శిశువు అదృశ్యమైనట్లు తల్లి గుర్తించింది. ఈ సంఘటనపై జాయింట్ కలెక్టర్ శ్రీధర్ విచారణకు ఆదేశించారు.
చిత్తూరు నగరం మంగ సముద్రానికి చెందిన రహమత్ భార్య షబానా రెండవ కాన్పు కోసం ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల కిందట షబానా మగ శిశువుకు జన్మనిచ్చారు. అయితే శనివారం వేకువ జామున మూడు గంటల సమయంలో షబాన శిశువుకు పాలిచ్చి నిద్రపోయారు. ఉదయం లేచి చూసే సరికి పక్కన బిడ్డ కనిపించకపోవడంతో ఆ తల్లి తల్లడిల్లి పోయింది. శిశువు అదృశ్యంపై చిత్తూరు టూ టౌన్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. సీఐ యుగంధర్ సంఘటన స్థలానికి చేరుకొని సీసీ పుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :విశాఖ కేజీహెచ్‌లో అపహరణ.. శ్రీకాకుళం జిల్లాలో గుర్తించిన పోలీసులు