తిరుమల శ్రీవారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి.. మహాద్వారం వద్ద అర్చకులు ఇస్థికఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి సన్నిధికి చేరుకుని మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం.. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు. అదనపు ఈవో ధర్మారెడ్డి శేషవస్త్రంతో సత్కరించి.. స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.
CJ: శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - latest news in thirumala
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద అర్చకులు ఆయనకు ఇస్థికఫాల్ స్వాగతం పలికారు.
ఏపీ సీజే జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి