ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారిని దర్శించుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి - తిరుమల తాజా వార్తలు

తిరుమల శ్రీవారిని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగోయ్​ దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.

శ్రీవారిని దర్శించుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి

By

Published : Nov 17, 2019, 9:50 AM IST

శ్రీవారిని దర్శించుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి

తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగోయ్​ దర్శించుకున్నారు. పద్మావతి అతిథి గృహం నుంచి ఆలయానికి చేరుకున్న ప్రధాన న్యాయమూర్తి దంపతులకు మహాద్వారం వద్ద ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో దర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. సబేరాలో స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా... ఈవో తీర్థ ప్రసాదాలను, శ్రీవారి చిత్రపటాన్ని న్యాయమూర్తికి అందజేశారు.

తిరుమలేశుని దర్శించుకున్న భాజపా ఎంపీ

తిరుమల శ్రీవారిని భాజపా ఎంపీ సుజనా చౌదరి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు.

ఇదీ చూడండి:

వేలికొనలపైనే వెంకన్న సేవలు

ABOUT THE AUTHOR

...view details