చిత్తూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండవేడిమికి ఉక్కపోత తోడవుతున్న కారణంగా.. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇక.. ఫారాల్లో ఉండే కోళ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చిన్న కొండమరిలోని కోళ్ల ఫాంలో ఎండ వేడిమికి తాళలేక 2 వేల కోళ్లు మృతి చెందాయి. రూ. లక్షకు పైగా నష్టపోయినట్టు నిర్వాహకుడు తెలిపారు.