సచివాలయంలో చికెన్ బిర్యానీతో విందు - secretariat
14:59 October 02
మహాత్మాగాంధీ 150వ జయంతి రోజే చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో మాంసాహార భోజనం పెట్టటం వివాదాస్పదమవుతోంది. జిల్లాలోని సత్యవేడు మండలం చినపాండూరు, మత్తేరి మిట్ట గ్రామాల్లో ఈరోజు గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే గాంధీ జయంతి రోజు మాంసాహారంపై నిషేధం ఉన్నా వచ్చిన వారికి చికెన్ బిర్యానీతో భోజనాలు పెట్టటం విమర్శలకు తావిస్తోంది. గాంధీ జయంతి రోజు మాంసాహార విక్రయాలు జరగకూడదని సర్కార్ నిషేధాజ్ఞలు పెట్టినా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలా జరగటాన్ని పలువురు తప్పుపడుతున్నారు. మత్తెరి మిట్టలో జరిగిన గ్రామ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సత్యవేడు శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం వచ్చి వెళ్లిన కాసేపటికే మాంసాహార భోజనాలు పెట్టినా అధికారులు పట్టించుకోకపోవటం చర్చనీయాంశమైంది.