మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోందని... తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన సీవీ రామన్ ఇంజినీరింగ్ బ్లాక్, 3డీ ఎక్స్ పీరియెన్స్ ల్యాబ్‌ను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో కలిసి ప్రారంభించారు.
మహిళా సాధికారత దిశగా ప్రభుత్వ అడుగులు: చెవిరెడ్డి - మహిళా సాధికారికతకు ప్రభుత్వం కృషి
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన... సీవీ రామన్ ఇంజినీరింగ్ బ్లాక్, 3డీ ఎక్స్ పీరియెన్స్ ల్యాబ్‌ను తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు.
పద్మావతి వర్శటిలోని నూతన భవనాల ప్రారంభోత్సవం
రాష్ట్రంలోనే ఏకైక మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం... ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే భూమన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్యక్రమంలోనూ... మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందన్నారు. ఇటీవల భర్తీ చేసిన గ్రామ సచివాలయాల పోస్టుల్లోనూ... మహిళలకే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
ఇవీ చదవండి...తితిదే పాలకమండలిలో మరో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు